Hyderabad, ఆగస్టు 2 -- అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్​, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్​​ జీ తెలుగు. రెట్టింపు వినోదాన్ని అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా మిర్యాలగూడ వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది.

స్నేహితుల దినోత్సవం సందర్భంగా జీ తెలుగు సీరియల్స్​ 'పడమటి సంధ్యారాగం', 'జగద్ధాత్రి', 'దీర్ఘసుమంగళీభవ' నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు 'ప్రతిరోజూ పండగే' పేరున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది.

అభిమాన ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగిన కార్యక్రమం 'ప్రతిరోజూ పండగే' ఈ ఆదివారం టెలీకాస్ట్ కానుంది. అంటే, ఆగస్టు 3న రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రతిరోజూ పండగే ప్రసారం కానుంది. జీ తెలుగు ఇటీవల మిర్యాలగూడ వేదికగా ప్...