భారతదేశం, డిసెంబర్ 20 -- మరో సండే వచ్చేస్తోంది. ఈ సండేను మరింత స్పెషల్ గా మార్చేందుకు మూవీ మహోత్సవంతో జీ తెలుగు ఛానెల్ రెడీ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ఆదివారం ఏకంగా అయిదు బ్లాక్ బస్టర్లను ప్రీమియర్ చేయనుంది. ఇందులో ఫ్యాంటసీ, యాక్షన్, హారర్ థ్రిల్లర్లు, కామెడీ సినిమాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

జీ తెలుగు ఐదు వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో 'సండే మూవీ మహోత్సవం'ను అందిస్తోంది. రేపు (డిసెంబర్ 21) ఈ అయిదు సినిమాలు వరుసగా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నాయి. జీ తెలుగు తన ప్రత్యేక కార్యక్రమాల విభాగం 'సండే మూవీ మహోత్సవం'తో ఈ ఆదివారాన్ని ఒక అద్భుతమైన సినిమా పండుగగా మార్చబోతోంది.

జీ తెలుగు సండే సినిమా మారథాన్ ఉదయం 9:00 గంటలకు మెగా హిట్ సూపర్ హీరో ఫ్యాంటసీ థ్రిల్లర్ హనుమాన్‌తో ప్రారంభమవుతుంది. థియేటర్లలో హనుమాన్ మూవీ...