భారతదేశం, జనవరి 10 -- పండగ వస్తుందంటే చాలు తెలుగు టీవీ ఛానెల్స్ లో హంగామా మొదలవుతుంది. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీలాంటి పోటీపడి స్పెషల్ షోలు, సినిమాలతో సందడి చేస్తుంటాయి. ఈ సంక్రాంతికి కూడా జీ తెలుగు ఛానెల్ పలు షోలతో అలరించబోతోంది. ఈ ఆదివారం (జనవరి 11) నుంచే ఆ ఛానెల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ వివరాలు చూడండి.

ప్రతి పండగ మాదిరిగానే ఈ సంక్రాంతి వేళ తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందించడానికి జీ తెలుగు సిద్ధమైంది. కామెడీ డ్రామా 'మిత్ర మండలి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో పాటు, టాలీవుడ్ స్టార్స్ సందడి చేసిన సంక్రాంతి స్పెషల్​ 'సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు' ఈవెంట్‌ను అందిస్తోంది.

ప్రియదర్శి, నిహారిక ఎన్​ఎమ్​ జంటగా అలరించిన మిత్ర మండలి జనవరి 11 (ఆదివారం) మధ్యాహ్నం 3:30లకు, మాస్​మహారాజ్​ రవితేజ సందడి చేసి...