Hyderabad, జూలై 12 -- తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్​ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్‌​తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్​ 'జయం'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్​ జయం​.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్​ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం జులై 14న ప్రారంభం కానుంది. అంటే మరో రెండు రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జీ తెలుగులో జయం సీరియల్ ప్రసారం కానుంది.

జయం సీరియల్ కథ విషయానికొస్తే.. మాజీ బాక్సర్​ రుద్ర ప్రతాప్​ (శ్రీరామ్​ వెంకట్​), పేదింటి అమ్మాయి గంగావతి (వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది....