Hyderabad, జూలై 14 -- ప్రముఖ తెలుగు ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులోకి సోమవారం (జులై 14) నుంచి ఓ కొత్త సీరియల్ వస్తోంది. ఈ సీరియల్ పేరు జయం. గత వారమే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఇప్పుడు తొలి ఎపిసోడ్ కు సిద్ధమైంది. ప్రేమ, పట్టుదల, బాధ్యతల మధ్య సాగే ప్రేమకథ అంటూ ఈ సీరియల్ ను ఆ ఛానెల్ ప్రమోట్ చేస్తోంది.

జీ తెలుగులోకి వస్తున్న సీరియల్ పేరు జయం. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈరోజు (జులై 14) నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ ను జీ తెలుగు ఛానెల్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. శ్రీరామ్ వెంకట్, వర్షిణిలాంటి వాళ్లు నటించిన ఈ సీరియల్ పై భారీ ఆశలే పెట్టుకుంది. ఓ స్ఫూర్తివంతమైన కథతో రాబోతున్న సీరియల్ ఇది.

జయం సీరియల్ కథ మాజీ బాక్సర్​ రుద్రప్రతాప్ ​(శ్రీరామ్​ వెంకట్​), పేదింటి అమ్మాయి గ...