భారతదేశం, డిసెంబర్ 1 -- జీహెచ్ఎంసీ విస్తరణ గురించి ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో ఓఆర్ఆర్ చుట్టుపక్కల మున్సిపాలిటీలు కూడా జీహెచ్‌ఎంసీలోకి రానున్నాయి. అయితే జీహెచ్ఎంసీని మూడు పెద్ద కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. నగర పరిమితులు 650 చదరపు కిలోమీటర్ల నుండి దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. దీంతో రవాణా కనెక్టివిటీని పెంచడానికి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలును విస్తరించే ప్రణాళికను అధికారులు పరిశీలిస్తున్నారు.

ORR వెంబడి ఉన్న ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో హైదరాబాద్ చుట్టూ మెట్రో రింగ్ ఏర్...