భారతదేశం, డిసెంబర్ 15 -- జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి కార్పొరేటర్లు మేయర్‌ను కలిశారు. డివిజన్ల పునర్విభజనపై చర్చించారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌.. కార్పొరేటర్లు అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటిదాకా 13 వందలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 18వ తేదీన డివిజన్ల పునర్విభజనకు తుది ఆమోదం తెలపాలని జీహెచ్ఎంసీ అనుకుంటోంది.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎ...