భారతదేశం, డిసెంబర్ 17 -- జీహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ వరకు భూగర్భ జలాలను పెంచమే లక్ష్యంగా జలమండలి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.ఇంటింటా ఇంకుడుగుంతలను ఏర్పాటే చేసే దిశగా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. 200 గజాలు, 300 గజాలపైన ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంత తప్పనిసరి నిర్మాణం చేసుకునేలా ఏర్పాట్లు చేయనుంది.ఇదే అంశంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

జీహెచ్ఎంసీ నుండి ఓఆర్ ఆర్ వరకు భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా.. ఇంటికో ఇంకుడు గుంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అశోక్ రెడ్డి కోరారు. జలమండలి భూగర్భజలాల పెంపు కోసం ఇంకుడు గుంతల కార్యక్రమంలో ప్రతి నివాస సముదాయలు తమ కర్తవ్యంగా భావించి భాగస్వామ్యం అవసరమని చెప్పారు.

నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతూనే ఉంది. కానీ పెరుగుతున్న జనాభాకు...