Telangana,hyderabad, సెప్టెంబర్ 27 -- రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలుచోట్ల ఈ స్కీమ్ అమలుపై ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. అపార్ట్ మెంట్ తరహాలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఇదే విషయంపై తాజాగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకం కింద త్వ‌ర‌లో ఇండ్ల మంజూరు చేసేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. సీఎం ఆలోచనల మేరకు అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇండ్ల‌ను అందించేలా తీయ‌టి క‌బురు త్వ‌ర‌లోనే చెబుతామ‌న్నారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని కంటోన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోగ‌ల ర‌సూల్ పుర‌లో 344 డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి పొన్నం ప్ర‌భాక‌...