భారతదేశం, నవంబర్ 25 -- ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పుడున్న NPDCL, SPDCL రెండు డిస్కమ్‌లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మి...