Hyderabad, మే 10 -- సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా చిత్రలహరి. కల్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా మంచి హిట్ అందుకుంది. ఇందులోని ప్రేమ వెన్నెల, పరుగు పరుగు వెళ్తున్నా సాంగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి.

డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రలహరి సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే, ఈ సినిమాలోని పరుగు పరుగు అనే పాట ఫెయిల్యూర్‌గా భావించే చాలా మందికి అద్దం పట్టేలా ఉంటుంది. హీరో సక్సెస్ అవ్వడానికి ఎన్ని మంచి ప్రయత్నాలు చేసిన ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. ఆ ఫ్రస్టేషన్‌లో జీవితంలోనే ఒక ఫెయిల్యూర్ అని భావిస్తాడు హీరో.

అలా హీరోనే కాదు జీవితంలో సక్సెస్ కాక ప్లాన్స్ ఫెయిల్ అయి చాలా మంది ఫెయిల్యూర్‌గా మిగిలిపోయినట్లు భావించే వాళ్లకోసమే ఆ సాంగ్ రాసినట్లుగా ఉంటుంద...