Hyderabad, మే 5 -- ప్రస్తుత తరంలో అందరూ వేగవంతమైన ఫలితాల కోసం చూస్తున్నారు. ప్రతి ప్రయత్నానికి ఫలితం కోసం చూస్తున్నారు. కానీ, కొన్ని లక్ష్యాలు సాధించేందుకు సుదీర్ఘంగా ఎదురుచూడాల్సి ఉంటుంది. మానసికంగా అలసటకు కూడా గురి కావొచ్చు. మోటివేషన్ సడలిపోవచ్చు. అసలు నేను గెలవగలనా అనే అనుమానాలు కూడా రావచ్చు. వీటన్నిటినీ దాటి విజయం వైపుకు ప్రయాణించాలంటే, శ్రమతోనూ, సమర్థతోనూ మాత్రమే అది సాధ్యపడుతుంది.
విజయం కోసం చేసే ప్రయాణంలో ముందే ఫలితాలపై దృష్టి పెట్టకూడదు. సుదీర్ఘమైన లక్ష్యాలను చేరుకునే సమయంలో ప్రయాణంపై ఫోకస్ ఉండాలి. దాని కోసం రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోగలగాలి.
మీ గమ్యం ఇంకా చాలా దూరంలో ఉండొచ్చు. కానీ, దాని వైపు మీరు వేస్తున్న ప్రతి అడుగును ఒక గెలుపుగా భావించాలి. ఈ ప్రయాణంలో చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుని మీకు మీరే అభినందనలు తెలుపుకోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.