Hyderabad, జూన్ 9 -- తెలుగు హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న థియేటర్లలో కన్నప్ప విడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్‌గా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కన్నప్ప ఈవెంట్‌లో హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ .. "కన్నప్ప ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది. మాకు మెమరబుల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తీయడానికి, నేను ఇక్కడ నిలబడటానికి చాలామంది సాయం చేసారు. నాకు మా నాన్న దేవుడు.. ఆయన లేకపోతే నేను లేను. అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి" అని అన్నాడు.

"ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకూ కూడా బ్రహ్మానందం గారు ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది.. ధైర్యంగా ఉండమని ప్రతీ నిమిషం చెబుతూ వచ్చారు" అని మంచు విష్ణు తెలిప...