Hyderabad, ఆగస్టు 21 -- టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మెప్పించింది బ్యూటిఫుల్ మధు శాలిని. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న మధు శాలిని ప్రజెంటర్‌గా మారి ప్రజెంట్ చేస్తున్న సినిమా కన్యా కుమారి. తెలుగులో రొమాంటిక్ లవ్ స్టోరీగా కన్యా కుమారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన కన్యా కుమారి సినిమాలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కన్యా కుమారి సినిమా ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కన్యా కుమార్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో గూఢచారి మూవీ డైరెక్టర్ శశి కుమార్ తిక్క ఇంట్రెస్టింగ...