భారతదేశం, జూన్ 25 -- రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జీడిమెట్ల అంజలి హత్య కేసును పోలీసులు చేధించారు. 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఇవాళ మీడియాకు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలని హత్య చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సురేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ముగ్గురు కలిసి హత్య చేశారని వివరించారు. ప్లాన్ ప్రకారమే మర్డర్ జరిగిందని పేర్కొన్నారు.

జూన్ 19వ తేదీన సదరు బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లి అంజలి మరునాడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. అదే రోజు బాలిక రాత్రి ఇంటికి తిరిగొచ్చింది. కన్న కుమార్తె ఇంటికి చేరుకోవటంతో.. వివాదం సద్దుమణిగింది. అయితే మరునా...