భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2025లో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించింది. గత సంవత్సరంతో పోలిస్తే.. 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2024 ఆగస్టులో 3298 కోట్లు కాగా.. 2025 ఆగస్టులో రూ. 3,989 కోట్లుగా నమోదయ్యాయి. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబు.ఎ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. 'ఆగస్టు 2025లో జీఎస్టీ ఆదాయ పనితీరుకు సంబంధించి, నికర జీఎస్టీ వసూళ్లు రూ. 2,977 కోట్లకు చేరుకోగా, స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 3,989 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్ నుండి ఆగస్టు, 2025 వరకు వరుసగా ఐదు నెలలు, స్థూల, నికర జీఎస్టీ వసూళ్లు రెండూ.. మునుపటి ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే రికార్డులను అధిగమించాయి.' అని అన్నారు.

2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. ఈ ఆగస్టులోనే ఆంధ్రప్రదేశ...