భారతదేశం, ఆగస్టు 16 -- దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించారు. 2025 దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు అమలు కావొచ్చని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉన్నాయి. ఇక దీపావళి నుంచి రెండే శ్లాబులు అమల్లోకి వస్తాయి. అవి 12, 18 శాతం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.

12 శాతం జీఎస్టీ శ్లాబ్ కిందకు వచ్చే వస్తువులు 5 శాతం జీఎస్టీ శ్లాబ్ కిందకు రావచ్చు. ఇక 28 శాతం జీఎస్టీ శ్లాబ్ కిందకు వచ్చే వస్తువులు 18 శాతం జీఎస్టీ శ్లాబ్ కిందకు రావచ్చు. అయితే విలాస వస్తువులు, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు 40 శాతం జీఎస్టీ శ్లాబ్ ఉంటుంది.

5శాతం, 18శాతం, 40 అనే మూడు జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. 1...