భారతదేశం, డిసెంబర్ 27 -- ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కాగా. వీటిపై అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తోంది. దీంతో వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన సీఎం చంద్రబాబు.. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. కొన్నింటిని మార్పు చేసే విషయంపై సమాలోచనలు జరిపారు. అయితే రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలిపే ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిసింది.

ఇప్పటికే ప్రకటించిన మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరగాల్సి ఉంది. అయితే తాజా ప్రతిపాదనలు, జరిగిన చర్చల నేపథ్యంలో... 28 జిల్లాలకే పరిమితం...