భారతదేశం, అక్టోబర్ 25 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో జియో హాట్‌స్టార్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సౌత్, నార్త్ ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తుంటుంది హాట్‌స్టార్. అయితే, నేటి (అక్టోబర్ 25) టాప్ 10 తెలుగు ఓటీటీ ట్రెండింగ్ సినిమాలను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో చూపించింది. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోన్న అందులో 4 మాత్రం కచ్చితంగా చూడాల్సినవిగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బుల్లితెర మెగా పాపులర్ షో బిగ్ బాస్ 9 తెలుగు. ఈ తొమ్మిదో సీజన్ జియో హాట్‌స్టార్‌ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 1 ప్లేసులో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్స్ ఉన్న బిగ్ బాస్ తెలుగు 9 నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

విజయ్ ఆంటోనీ పవర్ బ్రోకర్‌గా నటించిన పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భ...