భారతదేశం, జనవరి 15 -- రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్' (JFS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను గురువారం వెల్లడించింది. కంపెనీ ఆదాయం భారీగా పెరిగినప్పటికీ, నికర లాభంలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. డిసెంబర్ 31తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 268.98 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ. 294.78 కోట్లుగా ఉండటం గమనార్హం.

లాభం తగ్గినా, కంపెనీ ఆదాయం మాత్రం అంచనాలను మించి దూసుకెళ్లింది. గత ఏడాది క్యూ3లో రూ. 449 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం, ఇప్పుడు 101 శాతం వృద్ధి చెంది రూ. 901 కోట్లకు చేరింది. అయితే కొత్త వ్యాపారాల్లోకి పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాల విస్తరణ కోసం ఖర్చులు పెరగడంతో నికర లాభంపై ఆ ప్రభావం పడింది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (AUM) కూడా గత త్రై...