Hyderabad, జూలై 3 -- క్రైమ్ థ్రిల్లర్‌కు లీగల్ డ్రామా తోడైతే అదే జియోహాట్‌స్టార్ కొన్నేళ్లుగా అందిస్తున్న క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ అవుతుంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ గురువారం (జులై 3) వచ్చిన చివరి ఎపిసోడ్, క్లైమ్యాక్స్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసేలా ఉంది.

క్రిమినల్ జస్టిస్.. ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన హిట్ క్రైమ్ థ్రిల్లర్, లీగల్ డ్రామా వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇందులో మాధవ్ మిశ్రా అనే లాయర్ గా ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠీ నటిస్తున్నాడు. తాజాగా ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో నాలుగో సీజన్ వచ్చింది. కొన్నాళ్లుగా ప్రతి గురువారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

ఈ గురువారం (జులై 3) చివరి ఎపిసోడ్ వచ్చేసింది....