భారతదేశం, జూన్ 3 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ కొత్త కంటెంట్ వస్తూనే ఉంటోంది. థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఆయా ఓటీటీల స్పెషల్ మూవీస్, సిరీస్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అలా గత వారం జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో అడుగుపెట్టిన ఓ సినిమా, మరో సిరీస్ ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ థ్రిల్లర్ మూవీ, వెబ్ సిరీస్ కు ఫ్యాన్స్ నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది.

జియోహాట్‌స్టార్‌ స్పెషల్ వెబ్ సిరీస్ గా వచ్చిన క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ ఓటీటీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ క్రిమినల్ జస్టిస్ లో భాగంగా నాలుగో సీజన్ గా ఇది నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మే 29ను జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లాయర్ మాధవ్ మిశ్రాగా సీనియర్ యాక్టర్ పంక...