భారతదేశం, జూన్ 18 -- థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఓటీటీ స్పెషల్ కంటెంట్ తోనూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది జియోహాట్‌స్టార్‌. డిఫరెంట్ జోనర్లో ఆ ఓటీటీ స్పెషల్ సినిమా, సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేసేందుకు స్పై థ్రిల్లర్ ను తీసుకొస్తుంది జియోహాట్‌స్టార్‌. మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఈ స్పై ఫిల్మ్ ఉంటుందని జియోహాట్‌స్టార్‌ ఓటీటీ చెప్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.

సలకార్ పేరుతో స్పెషల్ ఫిల్మ్ ను తీసుకురాబోతోంది జియోహాట్‌స్టార్‌ ఓటీటీ. ఈ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పై థ్రిల్లర్ గా దీన్ని రెడీ చేస్తోంది. బుధవారం (జూన్ 18) సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన జియోహాట్‌స్టార్‌ ఈ స్పెషల్ ఫిల్మ్ టైటిల్ ను రివీల్ చేసింది. ''దేశ భద్రత కోసం అత్యున్నత అంకితభావంతో పని...