భారతదేశం, డిసెంబర్ 10 -- జియోహాట్‌స్టార్‌లో ఈరోజు అంటే బుధవారం (డిసెంబర్ 10) టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఏవో చూడండి. ఇందులో ఈ మధ్యే ముగిసిన హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 19' మొదటి స్థానంలో నిలవగా, తెలుగు సూపర్ హిట్ మూవీ 'మిరాయ్', మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ 'డైస్ ఇరే' కూడా టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాయి.

కలర్స్ టీవీలో ప్రసారమైన పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 19 ఇటీవల డిసెంబర్ 7న గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. గౌరవ్ ఖన్నా ఈ సీజన్ విజేతగా నిలిచాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలవగా, ప్రణీత్ మోరే మూడో స్థానంలో నిలిచాడు. ఆగస్టు 24న మొదలైన ఈ షో.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

రెండో స్థానంలో కూడా కలర్స్ ఛానెల్ కే చెందిన రియాలిటీ షో ఉంది. భారతీ సింగ్ హోస్ట్ చేస్తున్న ఈ కుకింగ్ కామెడీ షోలో...