Hyderabad, జూలై 14 -- హారర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఓ మూవీ ఉంది. ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్సేన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా రెండేళ్ల కిందట అప్పటి జియోసినిమా ఓటీటీలోనే నేరుగా స్ట్రీమింగ్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ మూవీ తెరపైకి వచ్చింది.

హారర్ థ్రిల్లర్ మూవీ బూ (Boo) ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే మే, 2023లో అప్పటి జియోసినిమా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీ మరోసారి ప్రమోట్ చేస్తోంది.

వీకెండ్ సజెషన్ అంటూ తన ఎక్స్ అకౌంట్ లో ఈ సినిమా గురించి చెప్పింది. "బూ మూవీతో హాలోవీన్ స్టోరీల గురించి తెలుసుకునే టైమ్ ఇది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది"...