భారతదేశం, ఫిబ్రవరి 17 -- జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మీకు ఉందా? అయితే ఫిబ్రవరి నెల మిగిలిన రోజుల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇందులోకి రాబోతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాస్ లాంటివి ఇందులో ఉండనున్నాయి. మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ నుంచి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వరకు ఫిబ్రవరి 18 నుంచి 27 మధ్య రానున్న మూవీస్, సిరీస్ ఏవో చూడండి.

మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్' ఈ నెల చివర్లో రాబోతోంది. రోస్లిన్ అనే 17 ఏళ్ల అమ్మాయికి పీడకలలు వస్తుంటాయి. ఆకుపచ్చ కళ్ళు ఉన్న ఒక ఆగంతకుడు ఆమెను వెంటాడుతుంటాడు. ఆ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. జీతూ జోసెఫ్ షో రన్నర్ గా ఉన్న ఈ సిరీస్ లో మీనా, వినీత్ లాంటి సీనియర్ నటీనటులు నటించారు.

జంతు ప్రేమికులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే తమిళ ఫీల్ గుడ్ ఎంటర్ట...