Hyderabad, మే 10 -- ప్రొటీన్ కోసం కేవలం చికెన్‌ని మాత్రమే ఎన్ని రోజుల వరకూ తింటారు. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా అయితే ప్రొటీన్ కావలసిన ప్రొటీన్ తినట్టు ఉంటుంది అలాగే నోటికి కాస్త కొత్త టేస్ట్ ఆస్వాదించినట్టు కూడా ఉంటుంది. చికెన్, మిల్ మేకర్, బంగాళదుంప లాంటి ప్రొటీన్ కాంబోలతో సలాడ్ తయారు చేసుకుని ఉదయాన్నే తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి.

బంగాళదుంపలు: శక్తినివ్వడంతో పాటు పోషకాలు, ఫైబర్ అందిస్తాయి. సలాడ్‌కు నిండుదనాన్నిస్తాయి.

చికెన్: ప్రోటీన్ అందించి కండరాలకు బలం చేకూరుస్తుంది..

పెరుగు: ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ కలిగి ఉంటుంది. సలాడ్‌కు క్రీమీనెస్ ఇస్తుంది.

నిమ్మరసం: విటమిన్ సి అందిస్తుంది. ఎల్లప్పుడూ తాజాదనాన్ని పెంచుతుంది.

చీజ్/వెన్న: కొవ్వు, కాల్షియం ఇస్తాయి. రుచిని పెంచు...