భారతదేశం, ఆగస్టు 31 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో టియాంజిన్‌లో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, వాణిజ్యం వంటి అంశాలపై లోతుగా చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. దీనితో పాటు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌ను భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.

చైనాలోని టియాంజిన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ముఖ్యమైన సమావేశం తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆ వివరాలను పంచుకుంది. భారతదేశం, చైనా మధ్య ఏ ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయో విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశం, చైనా మధ్య ప్రధాన చర్చలు సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, వాణిజ్యంపై ఉన్నాయని విదేశాంగ కార్యదర్...