భారతదేశం, నవంబర్ 4 -- ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం నటులు త్వరలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వారిలో జాన్వి స్వరూప్ కూడా ఒకరు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తల్లి మంజుల ఘట్టమనేని మాట్లాడుతూ.. 'జాన్వి సిద్ధంగా ఉంది, ఆమెలో ఆ సత్తా ఉంది' అని అన్నారు. జాన్వి తాత దివంగత సూపర్ స్టార్ కృష్ణ, మామయ్య మహేష్ బాబు కావడంతో ఆమెపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా రంగ ప్రవేశానికి జాన్వి 'చాలా పక్కాగా' ఉందని మంజుల నమ్ముతున్నారు.

''అరంగేట్రానికి ముందు జాన్వికి సాధారణ జీవితం ఇవ్వాలనుకున్నా. పదేళ్ల వయసులో 'మనసుకు నచ్చింది' (2018, మంజుల దర్శకత్వం) సినిమాలో నటించినప్పుడే, ఆమె నటనలో సహజత్వాన్ని గమనించాను. ఆమెలో ఆ ప్రతిభ ఉందని నాకు తెలుసు, కానీ అప్పుడే శిక్షణ ప్రారంభించలేదు. ఆమెను స్వేచ్ఛగా వదిలేసి, సాధారణ జీవితాన్ని గడపనిచ్చా...