Hyderabad, సెప్టెంబర్ 19 -- జాన్వీ కపూర్ నటించిన మూవీ హోమ్‌బౌండ్ ఆస్కార్స్ బరిలో నిలిచింది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా శుక్రవారం (సెప్టెంబర్ 20) ఎంపికైంది. ఈ డైరెక్టర్, సినిమా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ తోపాటు జాన్వీ కపూర్ కూడా ఈ అరుదైన ఘనతపై స్పందించారు.

హోమ్‌బౌండ్ సినిమా అకాడమీ అవార్డ్స్ కు ఎంపికైన కొన్ని నిమిషాల తర్వాత కరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పోస్టర్లను ఒక ఎమోషనల్ నోట్‌తో పోస్ట్ చేశాడు. "నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలలో ఇదీ ఒకటి. మా సినిమా 'హోమ్‌బౌండ్‌' 98వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీకి ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైనందుకు చాలా గౌరవంగా, సంతోషంగా ఉంది.

కథను, మమ్మల్ని, ఇండియన్ సి...