భారతదేశం, సెప్టెంబర్ 3 -- 2019లో విడుదలైన మలయాళ సినిమా 'ఒరు అడార్ లవ్'లో కన్ను కొట్టి, ముద్దు పెట్టి తుపాకీ పేల్చిన సీన్ తో తెగ వైరల్ గా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. దీంతో ఆమె లైఫ్ ఛేంజ్ అయిపోయింది. హీరోయిన్ గా ఎదిగిపోయింది. అలాంటి ట్రెండింగ్ బ్యూటీ రీసెంట్ గా రిలీజైన పరమ్ సుందరి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కనిపించడం ఫ్యాన్స్ కు షాక్ కలిగించింది. ఆమెకు డైలాగ్ కూడా లేదు.

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ 'పరమ్ సుందరి'లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా ప్రియా వారియర్ కనిపించింది. ఆమె డైలాగ్ కూడా లేని పాత్రలో కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆమె ఎందుకు ఈ పాత్రకు ఒప్పుకుంది అని ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రియా ఎరుపు, తెలుపు రంగు చీర కట్టుకుని, సిద్ధార్థ్ వెనుక జన...