భారతదేశం, జనవరి 12 -- తనకు ఐబీఎస్​ (ఇరిటెబుల్​ బావెల్​ సిండ్రోమ్​) వ్యాధి ఉన్నట్టు బాలీవుడ్ యంగ్ బ్యూటీ, ప్రముఖ నటి జాన్వీ కపూర్​ సోదరి ఖుషీ కపూర్ వెల్లడించారు.

ఓర్హాన్‌ అవత్రామణి (ఓర్రీ) ఇటీవల చేసిన ఒక వీడియోలో.. 'నీ జీవితంలో అత్యంత విశ్వసనీయమైనది ఏది?' అని అడిగిన ప్రశ్నకు ఆమె ఏమాత్రం తడుముకోకుండా "ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ (ఐబీఎస్​)" అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఈ సమస్య తనను గత కొంత కాలంగా వేధిస్తోందని ఆమె వివరించారు.

అసలు ఏంటీ ఈ ఐబీఎస్? ఇది ప్రాణాంతకమా? దీనివల్ల కలిగే ఇబ్బందులేంటి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము..

ఐబీఎస్ అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక సమస్య! దీనివల్ల ప్రేగుల పనితీరులో మార్పులు వచ్చి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. "జీర్ణనాళం గోడల్లో ఉండే నాడులు విపరీతమైన సున్నితత్వానికి గురవ్వడం వల్లే ఐబీఎస్ లక్షణ...