భారతదేశం, డిసెంబర్ 28 -- జాన్వీ కపూర్ బంగ్లాదేశ్ ఘటనపై స్పందించిన కొద్దిసేపటికే.. ఆమె అందం ఫేక్ అంటూ యూట్యూబర్ ధృవ్ రాఠీ (Dhruv Rathee) వీడియో రిలీజ్ చేశాడన్న వార్తలు నెట్టింట దుమారం రేపాయి. జాన్వీని టార్గెట్ చేశారన్న విమర్శలపై ధృవ్ రాఠీ తాజాగా స్పందిస్తూ.. ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. "నా వీడియోకి, ఆమె పోస్టుకి లింక్ పెడుతున్న వాళ్లు కాస్త బుర్ర వాడాలి" అంటూ లాజిక్‌తో సమాధానం చెప్పాడు.

డిసెంబర్ 25న ధృవ్ రాఠీ "ది ఫేక్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్ సెలబ్రిటీస్" పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో జాన్వీ కపూర్, దీపికా పదుకోన్ వంటి తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారని చెప్పాడు. అయితే అదే రోజు జాన్వీ కపూర్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి పోస్ట్ పెట్టడం, ఆ వెంటనే ధృవ్ వీడియో రావడం యాదృచ్ఛికంగా జరిగింది. దీంతో జాన్వీని అవమ...