భారతదేశం, డిసెంబర్ 27 -- ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ల ప్లాస్టిక్ సర్జరీలపై చేసిన వీడియో దుమారం రేపుతోంది. అందులో జాన్వీ కపూర్ అందం కృత్రిమమని ఆరోపించడంతో, ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒర్రీ (Orry) రంగంలోకి దిగాడు. ధృవ్ రాఠీని "యాంటీ నేషనలిస్ట్" అంటూ చాలా ఘాటుగా విమర్శించాడు.

యూట్యూబర్ ధృవ్ రాఠీ, బాలీవుడ్ సెలబ్రిటీల గొడవ ముదిరింది. జాన్వీ కపూర్‌ని టార్గెట్ చేస్తూ ధృవ్ చేసిన వీడియోపై సోషల్ మీడియా స్టార్ ఒర్రీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి సీరియస్ అయ్యాడు.

డిసెంబర్ 25న ధృవ్ రాఠీ తన ఛానెల్‌లో "ది ఫేక్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్ సెలబ్రిటీస్" అనే వీడియో పోస్ట్ చేశాడు. అందులో జాన్వీ కపూర్, దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా, కాజోల్ వంటి తారలు ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్, స్కిన్ లైటనింగ్ చేయించుకున్నారని చెప్పాడు.

ముఖ్యంగా జాన్వీ కపూర్ ఫోటోను...