భారతదేశం, జూన్ 30 -- ప్రతీ సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశం కోసం అహర్నిశలు శ్రమించే వైద్యులను గౌరవించుకోవడానికి, వారి త్యాగాలను గుర్తించడానికి ఈ రోజును కేటాయించారు. 2025 సంవత్సరానికి థీమ్ ఏమిటి, ఈ రోజు చరిత్ర ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ప్రతీ సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైన థీమ్‌తో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం (2025) థీమ్ "మాస్క్ వెనుక: వైద్యులకు వైద్యం చేసేది ఎవరు?" (Behind the Mask: Who Heals the Healers?). ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎదుర్కొంటున్న మానసిక, భావోద్వేగ సమస్యలను ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. సమాజం వారిని కేవలం సేవకులుగా చూడకుండా, వారి అవసరాలను, కష్టాలను గుర్తించి, సానుభూతి, మద్దతు ఇవ్వాలని, వారి ఆరోగ్యం, శ్రేయస్సు కూడా ముఖ్యమని ఈ థీమ్ గుర్తు చేస్తుంది....