భారతదేశం, మే 10 -- జాతీయ భద్రతా హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడాన్ని నిషేధించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

భారతదేశం అంతటా కొనసాగుతున్న హై అలర్ట్ నేపథ్యంలో.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో భద్రతా ఏర్పాట్లను తీవ్రతరం చేశారు. నగరంలోని బహిరంగ ప్రదేశాలలో.. ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల సమీపంలో పటాకులు లేదా బాణసంచా పేల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. హైదరాబాద్ నగర పోలీసు చట్టంలోని సెక్షన్ 67(సీ) కింద.. నగర పోలీసు కమిషనర్ సీ.వీ. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా భద్రత, ఆందోళనలు నిషేధానికి కారణమని స్పష్టం చేశారు.

'బాణసంచా నుంచి అకస్మాత్తుగా వచ్చే పెద్ద శబ్దాలను పేలుళ్లు లేదా ఉగ్రవాద సంబంధిత కార్...