భారతదేశం, ఆగస్టు 2 -- 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 12th ఫెయిల్ మూవీ అదరగొట్టింది. 2023కి గాను బెస్ట్ మూవీ అవార్డుతో పాటు.. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా సొంతం చేసుకుంది. విక్రాంత్ మస్సే ఈ మూవీలో అద్భుతంగా నటించాడు. చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ మూవీ నేర్పే జీవిత పాఠాలపై ఓ లుక్కేద్దాం.

12th ఫెయిల్ సినిమా 2023 అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత కథతో ఈ హిందీ మూవీని విధు వినోద్ చోప్రా తెరకెక్కించాడు. ఆయనే ప్రొడ్యూసర్ కూడా. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మస్సే నటించాడు. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లు రాబట్టింది.

థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన 12th ఫెయిల్ మూవీ 2023 డిసెంబర్ 29 నుంచి జియోహాట్‌స్టార్‌...