Hyderabad, జూలై 27 -- విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్‌డమ్. విజయ్‌తోపాటు మరో హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించాడు. మిస్టర్ బచ్చన్ బ్యూటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా విజయ్ దేవరకొండ సరసన జోడీ కట్టింది. క్లాసిక్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి కింగ్‌డమ్ సినిమాకు దర్శకత్వం వహించారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన కింగ్‌డమ్ మూవీ జూలై 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్‌డమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా శనివారం (జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కింగ్‌డమ్ ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత నాగవం...