Hyderabad, ఆగస్టు 30 -- కుశ్ లవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మయూఖం. ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ బులెమోని దర్శకత్వం వహించారు. భారీ పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న మయూఖం సినిమాను సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా ఆగస్ట్ 29న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మయూఖం సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. అలాగే, అతిథులుగా వచ్చిన సినీ ప్రముఖులు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు.

డీవోపీ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ.. "వెంకట్ గారు నాకు చాలా కాలంగా పరిచయం. ఆయన ఒకరోజు పిలిచి జాతి రత్నాలు తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావ్ అని అడిగారు. ఆ తర్వాత మయూఖం కథ వినిపించారు. కథ వినగానే సార్ మనం ఈ సినిమా చేస్తున్న...