భారతదేశం, డిసెంబర్ 12 -- ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మ జాతర జ‌న‌వ‌రి నెల‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాత‌ర కోసం శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు.

ఇవాళ గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను పరిశీలించారు. దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను,జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వే...