Hyderabad, ఏప్రిల్ 28 -- ఆరోగ్యం కోసం పండ్లు ఎంతో ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అనేక రోగాల నుండి కాపాడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ,రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, కొన్నిసార్లు మనం చేసే ఒక చిన్న పొరపాట్లు మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అదేంటంటే కొన్ని రకాల పండ్లను కలిపి తినడం. ఆయుర్వేదం ,పోషకాహార నిపుణులు కొన్ని రకాల పండ్ల కలయికను ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం:

పుచ్చకాయ ,కర్బూజ జాతికి చెందిన పండ్లను వేర్వేరుగా తినడమే మంచిది. వీటిని ఇతర పండ్లతో కలిపితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పుచ్చకాయ చాలా తేలికగా ,త్వరగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర పండ్లతో కలిపినప్పుడు, పుచ్చకాయ త్వరగ...