భారతదేశం, మే 9 -- గ్రౌండ్ లో బ్యాట్ తో సిక్సర్లు, ఫోర్లు బాదిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి స్టెప్పులు కుమ్మేశాడు. ఈ పెయిర్ కలిసి ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ లో అదరగొట్టారు. 'బెసోస్' వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో క్రమంగా ట్రెండ్ అవుతోంది.

'బెసోస్' వీడియో సాంగ్ గురువారం (మే 8) యూట్యూబ్ లో రిలీజైంది. ఇందులో బాలీవుడ్ హాట్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మూవ్స్ తో కుర్రకారును రెచ్చగొడుతోంది. తన సిజ్లింగ్ డ్యాన్స్ తో అందాల విందు వడ్డించింది ఈ భామ. గ్లామర్ ట్రీట్ తో సమ్మర్ హీట్ మరింత పెంచేసింది. ఆమె హాట్ డ్యాన్స్ మూవ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ వీడియో సాంగ్ లో అదరగొట్టాడు. తన స్వాగ్ వేరే లెవల్లో ఉంది. అంతే కాకుండా జాక్వెలిన్...