భారతదేశం, నవంబర్ 1 -- రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది మూవీ నుంచి శనివారం (నవంబర్ 1) ఫ్యాన్స్ కు సడెన్ సర్ ప్రైజ్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్ర పేరును ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. పెద్ది మూవీ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మాస్ అవతారంలో జాన్వీ ఆకట్టుకునేలా ఉంది.

శనివారం 'పెద్ది' చిత్ర బృందం ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. జాన్వీ పాత్ర పేరు, లుక్‌ను వెల్లడించే రెండు పోస్టర్‌లను చూసిన అభిమానులు ఆమె ఈ చిత్రంలో గాయని పాత్ర పోషిస్తోందని అంచనా వేస్తున్నారు. ఆమె క్యారెక్టర్ పేరు అచ్చియమ్మ.

పెద్ది సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ ...