భారతదేశం, జూలై 25 -- జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) త్వరలో ముగించనుంది. అర్హులైన అభ్యర్థులు జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ లేదా జేఎన్వీఎస్టీ 2025 (JNVST 2025) కు జూలై 29 వరకు జేఎన్వీ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 654 జేఎన్వీలు పనిచేస్తున్నాయి. ప్రవేశ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 13వ తేదీ శనివారం తొలి పరీక్ష ఉంటుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, మణిపూర్, ఒరిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తర...