భారతదేశం, జూన్ 1 -- జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 2 విడతల్లో సెలెక్షన్ పరీక్షను పూర్తి చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.వీటిల్లో ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణ 9 ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అప్లికేషన్ చేసుకునే వీలు ఉంది.

ఏపీ,తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025వ తేదీన ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2026 ఏడాదిలో ఏప్రిల్ 11వ తేదీన జరగుతుంది.

నవోదయ పరీక్ష మొత్తం 100 మ...