Karimnagar, ఏప్రిల్ 20 -- గత రెండు మాసాలుగా పెద్దపల్లి జిల్లాలో రైతులకు, పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తు కరెంట్ మోటర్లు ఎత్తుకెళ్ళే ఇద్దరిని పొత్కపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి డిసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.

ఓదెల మండల కేంద్రానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 39 కరెంట్ మోటర్లు, 750 మీటర్ల కేబుల్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ గత రెండు మాసాలుగా పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయ బావుల వద్ద, సాగునీటి కోసం కెనాల్ వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటర్లను ఎత్తుకెళ్తున్నారని వివరించారు. చోరీ చేసిన మోటర్లను అమ్మేందుకు జమ్మికుంట వైపు ట్రాలీ అటోలో తరలిస్తుండగా వాహనాల తనిఖీలో పట్టుబడ్డారని తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా కరెంట్ మోటర్ల ...