Hyderabad,telangana, ఏప్రిల్ 17 -- జలమండలి సరఫరా చేసే నీటిని అక్రమంగా మోటార్లతో తోడుతున్న వారిపై జలమండలి అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండు రోజులుగా మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ పేరుతో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు.

బుధవారం నగరంలోని ఓ అండ్ ఎం డివిజన్ - 6, ఎస్ఆర్ నగర్ లోని మధురానగర్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతంలో లో-ప్రెషర్ తలెత్తుతున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. కొంతమంది వినియోగదారుల ఇండ్లలో అక్రమంగా మోటార్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి ఓ హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్ళగా.. ఆ యజమాని తన నల్లాకు వ్యవసానికి వినియోగించే 2 హెచ్ పి మోటర్ తో నీటిని తోడడంతో యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది ఇళ్లకు సరిపడా నీటిని ఒక్కడే వాడితే మిగ...