భారతదేశం, అక్టోబర్ 30 -- మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్‌, హనుమకొండ తదితర ప్రాంతాల్లోని వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి. కీలక సూచనలు చేశారు.

అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్...