భారతదేశం, జనవరి 28 -- జర్మనీలోని మాన్‌హైమ్‌ నగరం భారతీయతతో పులకించిపోయింది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక 'ఇంటర్ కల్చరల్ హౌస్ ఆఫ్ మాన్‌హైమ్' (IKHM) వేదికగా ప్రవాస భారతీయులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వరుసగా మూడో ఏడాది కూడా అదే ఉత్సాహంతో మన రాజ్యాంగ ఆవిర్భావాన్ని, భారతీయ ప్రజాస్వామ్య విలువలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ వేడుకల్లో చిన్నారుల ప్రదర్శన అందరినీ కదిలించింది. మన్‌హైమ్, చుట్టుపక్కల నగరాల నుంచి వచ్చిన 70 మందికి పైగా చిన్నారులు, వివిధ భారతీయ రాష్ట్రాల వేషధారణలో ఒకే చోట చేరి 'భారత దేశ పటం' (India Map) ఆకారంలో నిలబడ్డారు. జర్మనీలో గడ్డకట్టే చలి ఉన్నప్పటికీ, వారిలో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన ఈ దృశ్యాలు భారత మాతపై వారికున్న ప్రేమాభిమానాలను ప్రతిబింబించాయి.

మ్యూనిచ్‌లోని భారత క...