భారతదేశం, జనవరి 1 -- జర్మనీలో జరిగిన ఒక అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడు. మృతుడిని జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిన్ రెడ్డిగా గుర్తించారు. హృతిన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్లాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి.

మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో, హృతిన్ భవనంపై నుండి దూకడంతో తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినప్పటికీ, పరిస్థితి మరింత దిగజారి గాయాలతో హృతిన్ రెడ్డి మరణించాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, సంఘటన కచ్చితమైన పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు రాష్ట్రంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీ...